ETV Bharat / priya

వంటింట్లో ఆ సమస్యా? అయితే ఇలా చేయండి..! - వంటింటి చిట్కాలు

వంటింట్లో ఆడవారు నిత్యం పోరాడుతుంటారు. ఓవైపు ఆఫీస్‌ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్‌ చేయాలంటే కత్తి మీద సామే!. ఏదో ఒక విధంగా కష్టపడి చేసినప్పటికీ కొన్ని పనులు తలనొప్పిగానే తయారవుతాయి. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. అటు వంటింట్లో పనిని సమర్థంగా నిర్వర్తించవచ్చు.. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

home remedies for Dandruff
వంటింటి చిట్కాలు
author img

By

Published : Oct 4, 2021, 8:01 AM IST

ఇంటి పనిని సమర్థంగా నిర్వర్తించడానికి నిత్యం పెద్ద యుద్ధమే చేస్తుంటారు ఆడవారు. అయినప్పటికీ కొన్ని పనులు తీరని సమస్యలుగానే ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించి వాటిని పరిష్కరించవచ్చు. ఇంతకీ అవేంటో చూద్దామా!.

  • వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిని కాగితపు సంచిలో వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
  • కాకరకాయలు ఫ్రిడ్జ్​లో పెట్టినప్పటికీ అవి పండిపోతూ ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్​లో ఉంచితే త్వరగా పండిపోకుండా ఉంటాయి.
  • ఆకుకూర కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని పూల మొక్కల మొదళ్లలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.
  • ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే ఉల్లిపాయ ముక్కలు కడిగిన నీళ్లను మొక్కల్లో పోస్తే కీటకాలు రాకుండా ఉంటాయి.
  • కిటికీలు, తలుపుల సందుల నుంచి చీమలు ఇంట్లోకి వస్తుంటే ఆ ప్రాంతంలో దాల్చిన చెక్కను పెట్టి ఉంచితే చీమలు రాకుండా ఉంటాయి.
  • కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేసుకుని ఒక గంట తర్వాత తలంటు స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • చలికాలంలో ఎక్కువగా నూనె గడ్డ కడుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో ఆవ నూనె కలిపితే నూనె గడ్డ కట్టకుండా ఉంటుంది.
  • గచ్చు నేల కడిగేప్పుడు ఆ నీళ్లలో కొంచెం ఉప్పు వేసి కడిగితే ఆరిన తర్వాత ఈగలు వాలకుండా ఉంటాయి.
  • పకోడీలు కరకరలాడుతూ ఉండాలంటే శనగ పిండిలో వేడి నూనె, చిటికెడు వంట సోడా కలిపి పకోడీ చేస్తే పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి.

మరిన్ని చిట్కాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:గొంతునొప్పికి ఈ చిట్కాలతో చెక్‌ పెట్టేయండి!

వంటింట్లో ప్రమాదాలు జరగకుండా.. ఇవి పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.