ETV Bharat / priya

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..! - నెల్లూరు చేపల పులుసు రెసిపీ

Nellore Chepala Pulusu Recipe in Telugu: నెల్లూరు చేపల పులుసు టేస్టే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి అంత రుచికరంగా ఉండే దానిని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు లేట్​.. ఈ విధానాన్ని ఫాలో అయ్యి నోరూరించే నెల్లూరు చేపల పులుసును వండుకుని ప్లేట్లు లాగించేయండి.

Nellore_Chepala_Pulusu_Recipe
Nellore_Chepala_Pulusu_Recipe
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 8:00 AM IST

Updated : Oct 29, 2023, 12:16 PM IST

Nellore Chepala Pulusu Recipe in Telugu: ఆదివారం వచ్చిందంటే నాన్​వెజ్​ ప్రియులకు పండుగ అన్నట్లే. ఇక ఫిష్​ ప్రేమికులకైతే నోట్లో లాలాజలం ఊరుతుంది. అయితే చేపల పులుసులో చాలా రకాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ మందికి నెల్లూరు చేపల పులుసు తినాలని ఉంటుంది. కానీ దానిని చేయడం అందరికీ రాదని అనుకుంటారు. అయితే ఇప్పుడా ఆ విషయంలో చింత అవసరం లేదు. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ టైమ్ పట్టదు. కానీ అబ్బో ఆ టేస్టే వేరు. ఇక్కడ చెప్పిన విధానంలో ట్రై చేస్తే.. ఎవరైనా చేపల పులుసును ఈజీగా చేసుకోని.. ప్లేట్లు నాకేస్తారు. మరి నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు, కుకింగ్​ ప్రాసెస్​ ఏంటో చూసేద్దాం..

తయారీకి కావాల్సినవి:

  • చేపలు- 1 కేజీ,
  • చింతపండు - 50 గ్రాములు,
  • ఉల్లిపాయలు- 2 (సన్నగా కట్ చేసి పెట్టుకోండి),
  • పచ్చిమిర్చి- 4,
  • పుల్లమామిడికాయ- 1,
  • టమాట- 1,
  • మెంతులు- అర టీస్పూన్,
  • జీలకర్ర- 1 టీస్పూన్,
  • ధనియాలు- 2 టీస్పూన్లు,
  • ఆవాలు- అర టీస్పూన్,
  • నూనె- 4 టేబుల్ స్పూన్లు,
  • కరివేపాకు కొద్దిగా,
  • అల్లం వెల్లుల్లి పేస్టు- 1 టీస్పూన్,
  • పసుపు- అర టీస్పూన్,
  • కారం- 4 టీస్పూన్లు,
  • ఉప్పు- సరిపడా,
  • కొత్తిమీర కొద్దిగా.
  • నిమ్మకాయ- 1

నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం:

Nellore Fish Pulusu Making Process:

  • ముందుగా చేపల్ని కావాల్సిన సైజులో కట్ చేయించుకోని.. వాటిని ఉప్పు, నిమ్మకాయతో బాగా కడగాలి.
  • తర్వాత చేప ముక్కలపై 2 టీస్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి.. కలుపుకోవాలి.
  • మసాలాలు అన్ని చేప ముక్కలకు పట్టించేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్టే అదిరిపోద్ది. వీటిని ఓ 15 నిమిషాలు పక్కన పెట్టండి.
  • పెద్ద నిమ్మకాయ సైజు (50 గ్రాములు)లో చింతపండు తీసుకొని... శుభ్రంగా కడిగి... కొద్దిసేపు నానబెట్టి.. గుజ్జు తీసుకోవాలి.
  • 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని సన్నగా తరగాలి
  • ఓ పుల్ల మామిడి కాయ తొక్కు తీసుకుని.. చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే టమాటాను కూడా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ లేకపోతే.. దాని బదులు మరో టమాటను కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. చిన్న కడాయి పెట్టి.. మెంతులు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, ధనియాలు 2 టీస్పూన్లు, ఆవాలు పావు టీస్పూన్ వేసి చిన్న మంటపై దోరగా వేయించి.. అనంతరం ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.
  • అవి కొద్దిగా చల్లారాక... రోలు లేదా మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి.
  • తర్వాత కొంచెం పెద్ద గిన్నె లేదా కడాయి స్టవ్​ మీద పెట్టి.. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యండి.
  • నూనె వేడెక్కాక... మెంతులు పావు టీస్పూన్, ఆవాలు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి.
  • ఉల్లిపాయలు కాస్తా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీస్పూన్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు దోరగా వేయించాలి.
  • అనంతరం మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వేసి.. ఫ్రై చేయాలి.
  • అవి కాస్త మెత్తగా అయ్యాక... పసుపు పావు టీస్పూన్, కారం 2 టీస్పూన్లు, ఉప్పు సరిపడా వెయ్యాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలకు ఉప్పు వేశాం. కాబట్టి... దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పడు సరిపడా వేసుకోవాలి.
  • తర్వాత ముందుగానే సిద్ధం చేసిన మసాల పొడిని ఇప్పుడు వేసి.. నిమిషం పాటూ ఫ్రై చెయ్యాలి.
  • ఆ తర్వాత... చింతపుండు గుజ్జును వేసుకుని కావాల్సినంత నీరు పోసుకోవాలి.
  • 3 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు నురగ వచ్చిన తర్వాత.. చేప ముక్కల్ని వన్ బై వన్ నిదానంగా వేయాలి. 10 నిమిషాలు ఉడికించాలి.
  • చేప ముక్కల రంగు మారుతూ ఉంటే... ఉడికినట్లే అని అర్థం. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి... స్టప్ ఆపేయండి. అంతే అదిరే రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.

How to Make Chepala Pulusu in Telugu: చేపల పులుసు ఇలా చేశారంటే.. గిన్నె ఊడ్చాల్సిందే..!

Fish curry: లేత బెండకాయలతో చేపల పులుసు

చేప పులుసు ఇష్టమా..? ఇలా ట్రై చేయండి!

Fish Curry Recipe: పాము చేప పులుసు.. టేస్ట్ మాత్రం!

'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!

Last Updated : Oct 29, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.