ETV Bharat / priya

చికెన్​ రెగ్యులర్​గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా! - Sukka Chicken Masala

Chicken Recipes: చాలా మందికి చికెన్​ అంటే ఇష్టం. అయితే.. చాలా మంది ఎప్పుడూ ఒకేలా వండుతుంటారు. అలాంటి వారికోసమే ఈ వెరైటీ రెసిపీ. అన్నం, రోటీ, పులావ్‌... ఇలా దేంతోనైనా తినగలిగే ఈ వంటకాలనూ మీరూ ట్రై చేయండి.

Chicken Recipes
Chicken Recipes
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 5:22 PM IST

Chicken Recipes : సండే వచ్చిందంటే.. నాన్​వెజ్​ ప్రియులకు పండగ అన్నట్లే. చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​.. అంటూ ఏదో ఒకరకం వండుకుంటారు. అయితే.. చికెన్​ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇసారి కొత్తగా ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

దహీ మసాలా కర్రీ:

Chicken Dahi Masala Curry:

కావలసిన పదార్థాలు:

  • చికెన్‌: అరకేజీ
  • పెరుగు: కప్పు
  • అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి ముద్ద: చెంచా
  • జీలకర్రపొడి: టేబుల్‌స్పూన్
  • మిరియాలపొడి: చెంచా
  • గరంమసాలా: అరచెంచా
  • పసుపు: అరచెంచా
  • ఉప్పు: తగినంత
  • నెయ్యి: పావుకప్పు
  • టొమాటోలు: రెండు
  • ఉల్లిపాయలు: రెండు
  • జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి: మూడు
  • గోరువెచ్చని నీళ్లు: కప్పు
  • కసూరీమేథీ: చెంచా
  • కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి-​ పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!

తయారీ విధానం:

  • ఓ గిన్నెలో పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, టమాట తరుగు వేయించాలి.
  • తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్‌ ముక్కలు వేసి ఓసారి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి.
  • అయిదు నిమిషాల తర్వాత జీడిపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మరికొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి మూత పెట్టాలి.
  • చికెన్‌ ఉడికాక కొత్తిమీర తరుగు, కసూరీమేథీ వేసి దింపేయాలి. అంతే నోరూరే దహీ మసాలా కర్రీ రెడీ..

నోరూరించే పులావ్​- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!

సుక్కా చికెన్‌ మసాలా:

Sukka Chicken Masala:

కావలసినవి:

  • చికెన్‌: అరకేజీ
  • ఉల్లిపాయలు: ఆరు (సన్నగా తరగాలి)
  • అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
  • పసుపు: అరచెంచా
  • ఉప్పు: తగినంత
  • నూనె: పావుకప్పు
  • నిమ్మరసం: టేబుల్‌స్పూను
  • దాల్చినచెక్క: చిన్న ముక్క
  • లవంగాలు: ఆరు
  • యాలకులు: రెండు
  • జీడిపప్పు: పన్నెండు (నానబెట్టుకుని పేస్టులా చేసుకోవాలి).

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

మసాలాకోసం:

  • ధనియాలు: టేబుల్‌స్పూను
  • జీలకర్ర: చెంచా
  • మిరియాలు: అరచెంచా
  • సోంపు: చెంచా
  • ఎండుమిర్చి: 5
  • కరివేపాకు రెబ్బలు: మూడు
  • ఎండు కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను.

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

తయారీ విధానం:

  • ముందుగా బాణలిలో మసాలా పదార్థాలను(ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఎండు కొబ్బరిపొడి) వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించుకోవాలి.
  • ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి పచ్చి వాసన పోయేవరకు చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి.
  • పది నిమిషాలయ్యాక చేసి రెడీగా పెట్టుకున్న మసాలా, జీడిపప్పు ముద్ద, అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికి కూర దగ్గరకు అయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.