LIVE: రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు- ప్రత్యక్ష ప్రసారం - Telugu Mahasabhalu Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 12:02 PM IST

Updated : Jan 5, 2024, 6:35 PM IST

World Telugu Mahasabhalu at Rajamahendravaram Live: తెలుగుభాష గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేస్తూ మాతృ భాష పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ రెండో తెలుగు మహాసభలు నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నేటినుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులతో పాటు గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తుంటే భాష ప్రాతిపదికన ఏర్పడిన మన రాష్ట్రంలో తెలుగును విస్మరిస్తున్నారని విమర్శించారు. మాతృభాషను విస్మరిస్తే పదకోశాలు, నిఘంటువులు వృథా అవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిదేశంలో మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంటే మన పాలకులు ఆంగ్లం వెంట పరుగెత్తడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాతృభాష అంతమైతే తెలుగుజాతి అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం

Last Updated : Jan 5, 2024, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.