కావాల్సినవి:
- బరకగా మిక్సీ పట్టిన గోధుమలు- అరకప్పు
- పెసరపప్పు- పావుకప్పు
- నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు- టీ స్పూన్
- జీలకర్ర- టీ స్పూన్
- ఇంగువ- చిటికెడు
- ఎండుమిర్చి- 2
- బంగాళాదుంప ముక్కలు - పావుకప్పు
- టమాటా ముక్కలు- పావుకప్పు
- క్యారెట్ ముక్కలు- పావుకప్పు
- బఠానీ- పావుకప్పు
- కరివేపాకు రెబ్బలు - పది
- తురిమిన కొత్తిమీర- కొద్దిగా
- పసుపు- అర టీస్పూన్
- కారం- టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- ఉప్పు- తగినంత
తయారీ:
బరకగా మిక్సీ పట్టిన గోధుమలు, పెసరపప్పును నీళ్లలో 10 నిమిషాలపాటు నానబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు గోధుమల్లోని నీటిని పారబోసి వీటిని కుక్కర్‌లో వేసి 2 నిమిషాలపాటు వేయించాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరంమసాలా వేసి తక్కువ మంట మీద కాసేపు మగ్గనివ్వాలి. మంచి వాసన వస్తుండగా క్యారెట్, బంగాళాదుంప, టమాటా ముక్కలు, బఠాణీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటన్నింటినీ బాగా కలిపి కాసేపు వేయించిన తర్వాత 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి అలంకరించుకోవడమే. ఆ తర్వాత ఆరగించడమే.
ఇవీ చూడండి: