ETV Bharat / lifestyle

శవాలతోనే సావాసం.. అరుణ ఎందరికో ఆదర్శం - Mortician mutyala Aruna story

కష్టాలు ఆమెకు దగ్గరి చుట్టాలు. తల్లి క్యాన్సర్‌తో చనిపోయింది. ప్రమాదంలో గాయాలై తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఇలా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా.. మనోధైర్యంతో ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రం భద్రాచలంకు చెందిన ముత్యాల అరుణ. భర్త చేసిన కాటికాపరి వృత్తినే బతుకుదెరువుగా మార్చుకొని ఎవరూ చేయని సాహసం చేస్తోంది.

special story on Mortician mutyala Aruna
కాటికాపరిగా మహిళ
author img

By

Published : Feb 3, 2021, 3:47 PM IST

ఈమె పేరు ముత్యాల అరుణ. అందరిలాగే.. భర్త, పిల్లలతో అందమైన జీవితం గడపాలని ఊహించుకుంది. కానీ, కష్టాలు ఆమెను నీడలా వెంటాడాయి. ఆనందంగా జీవించాలన్న కోరిక కుటుంబ సభ్యుల మరణాలతో కనుమరుగయ్యాయి. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. భర్త వృత్తినే బతుకుదెరువుగా మార్చుకొని భద్రాచలంలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తోంది. ధైర్యంగా అడుగు ముందుకేసి తాను బతకడమే కాదు మరో ఐదు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.

ఎవరూ చేయని సాహసం

అరుణకు చిన్న వయసులోనే రాజమండ్రికి చెందిన కాటికాపరి శ్రీనుతో వివాహమైంది. భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఉన్న వైకుంఠ ఘాట్‌లో శ్రీను పని చేసేవాడు. అప్పుడప్పుడు భర్తతో శ్మశాన వాటికకు వెళ్లిన అరుణ.. సాయంగా కొన్ని పనులు చేసేది. అలా అన్ని పనులు నేర్చుకుంది. కొన్నాళ్లకు భర్త అనారోగ్యానికి గురై మంచం పట్టడంతో.... వైద్యం కోసం ఆపసోపాలు పడింది. ఇంటిని తాకట్టు పెట్టడంతో పాటు ఎన్నో చోట్ల అప్పులు చేసింది. అన్ని చేసినా భర్త మరణించడంతో ఏ ఆధారం లేక కుంగిపోయిన అరుణ ఎవరూ చేయని సాహసం చేసింది. అదే శ్మశాన వాటికలో కాటికాపరిగా పని చేస్తూ.... తాను బతకడమే కాదు మంచానికే పరిమితమైన తండ్రి బాగోగులు చూస్తోంది.

వెనకడుగు వేయని దైర్యం

కళేబరాలు, కంకాళాలు కళ్లెదుట కనబడుతున్నా ఏ మాత్రం బెదురు లేకుండా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోంది. అనాథ మృతదేహాలకు సైతం అన్నీ తానై అంతిమ సంస్కారాలు చేస్తోంది. తండ్రితోపాటు మరో ఇద్దరు వృద్ధులకు అండగా నిలిచింది. ఇద్దరు అబ్బాయిలతో పాటు ఓ అమ్మాయిని పెంచుకుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసింది.

ఎంతోమందికి ఆదర్శం

సాధారణ మృతులకే కాదు.. ఇటీవల కాలంలో కొవిడ్‌తో మరణించిన వారికి అరుణ ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహించింది. కరోనా లక్షణాలతో చనిపోయిన వారి అస్థికలను తీసుకెళ్లేందుకు బంధువులు రాకపోతే.. తానే గోదావరిలో కలిపినట్లు అరుణ తెలిపింది. జీవన పోరాటంలో సాహసోపేతమైన విధులు నిర్వహిస్తున్న అరుణపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఆమె సాహస ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.