ETV Bharat / lifestyle

క్యాప్సికమ్​లోని పోషకాలతో రక్తహీనత, క్యాన్సర్​కు చెక్​ - capsicum uses

ఉరుకులు పరుగుల జీవితంలో సమయపాలన లేని తిండితో ఎంతో మంది మహిళలు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. రక్తహీనత, ఆర్థరైటిస్​, క్యాన్సర్​ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ వారానికి ఒకసారైనా మన ఆహారంలో క్యాప్సికమ్​ను భాగం చేసుకుంటే వాటిని నియంత్రించుకోవచ్చు.

solution for anemia and cancer with nutrients in capsicum
క్యాప్సికమ్​లోని పోషకాలతో రక్తహీనత, క్యాన్సర్​కు చెక్​..
author img

By

Published : Mar 22, 2021, 4:24 PM IST

ఓ వైపు ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోవైపు ఆర్థరైటిస్‌, క్యాన్సర్‌ వంటివాటితో ఇబ్బందిపడుతోన్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటిని నియంత్రించుకోవాలంటే క్యాప్సికమ్​ తినడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

క్యాన్సర్‌ ముప్పు అదుపులో: క్యాప్సికమ్​లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. దీంట్లోని కెరొటినాయిడ్‌ లైకోపిన్‌ గర్భ, మూత్రాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పును నియంత్రిస్తుంది.

ఎముకలు దృఢంగా: దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాప్సికమ్​ క్యాటరాక్ట్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌ బారినపడకుండానూ శరీరాన్ని రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దీంట్లో అధికంగా ఉండే విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాప్సికమ్​ అంతర్గత వాపులను నివారిస్తుంది.

ఇనుము లోపం లేకుండా: దీంట్లోని విటమిన్‌-సి శరీరం ఇనుమును గ్రహించేలా చేస్తుంది.

ఇదీ చదవండి:

అన్నార్తుల అక్షయపాత్ర.. ఈ పుణ్యాల బుట్ట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.