నూనె లేకుండా వంట సాధ్యం కాదు. మార్కెట్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అనేది తెలియదు. వాటిల్లో ఏది మంచిదో తెలుసుకుందాం.
సన్‌ఫ్లవర్ నూనె: దీంట్లో శాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు తక్కువ. మెనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఈ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే కీళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.

ఆవనూనె: ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మోనోశాచురేటెడ్ కొవ్వులతోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే గుండెపోటు రాకుండానూ కాపాడుతుంది.

ఆలివ్‌నూనె: ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే మెనోశాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు ఈ నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇవి లోడెన్సిటీ లైపో ప్రొటీన్ (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ నూనె దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడానికీ తోడ్పడుతుంది.

వేరుసెనగ నూనె: దీంట్లో విటమిన్-ఇ, మోనో శాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటిచూపు, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

నువ్వుల నూనె: దీంట్లో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఈ నూనెతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
ఇదీ చూడండి: రామమందిరం కోసం రూ. కోటితో మరికొంత భూమి కొనుగోలు