వయసు పెరుగుతోన్నా తానింత ఫిట్‌గా, చలాకీగా ఉండడానికి నిత్యం చేసే వ్యాయామాలే కారణమంటూ తన వీడియోల ద్వారా చెప్పకనే చెబుతుంటుంది బాలీవుడ్ ఫిట్టెస్ట్ బ్యూటీ మందిర. ఆరోగ్యం, ఫిట్‌నెస్, అందం, ఫ్యాషన్.. ఇలా ప్రతి విషయంలోనూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతుంటుంది. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్ టిప్స్, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాల గురించి సైతం వివరిస్తుంటుంది. అలా ఇటీవలే మరో షార్ట్ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ. అందులో చక్రాసనం (బ్యాక్ బెండ్ యోగా పోజ్) వేసిన ఆమె.. దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి చిన్న క్యాప్షన్ రాసుకొచ్చింది.
అన్నింటికీ ఒకే మందు!
కరోనా ప్రతి ఒక్కరినీ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోంది. దీంతో చాలామందిలో ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి.. ఇక వైరస్ సోకిన వారి ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడి క్రమంగా ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి. ఇలాంటి వారు చక్రాసనం వేయడం వల్ల ఆక్సిజన్ స్థాయులు పెంచుకోవచ్చంటోంది మందిర.
‘ఆక్సిజన్ స్థాయులు పెంచుకోవాలన్నా, మానసిక ఆందోళనల్ని తగ్గించుకోవాలన్నా, వెన్నెముక-భుజాలను దృఢంగా మార్చుకోవాలన్నా.. ఇవన్నీ చక్రాసనంతోనే సాధ్యమవుతాయి..’ అంటూ క్యాప్షన్ పెట్టిందామె. సాధారణంగా ఆక్సిజన్ స్థాయులు 95-100 మధ్య ఉంటే ఆరోగ్యవంతులుగా, 91-94 మధ్య ఉన్న వారిని మోడరేట్‌గా, అంతకంటే దిగువకు పడిపోతే ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. అయితే మోడరేట్ దశలో ఉన్న వారు, ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని/ఆక్సిజన్ స్థాయుల్ని పెంచుకోవాలనుకునే వారికి ఈ వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని తన పోస్ట్‌తో చెప్పకనే చెప్పిందీ బ్యూటిఫుల్ మామ్. ఈ క్రమంలో ఈ వ్యాయామం చేసే వారు బలవంతంగా కాకుండా, శరీరానికి సౌకర్యవంతంగా ఉంటేనే చేయాలి.. అది కూడా గతంలో యోగా ప్రాక్టీస్ ఉండి.. నిపుణుల సలహా తీసుకున్నాకే దీన్ని సాధన చేయడం మంచిది.
- ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకొని.. మోకాళ్లను మడిచి పాదాలను నేలకు ఆనించాలి.
- ఇప్పుడు చేతుల్ని వెనక్కి మడిచి (ఈ క్రమంలో చేతి వేళ్లు భుజాల వైపు చూసేలా ఉండాలి) తలకు ఇరువైపులా నేలకు తాకించాలి.
- ఆపై రెండు చేతుల్ని కిందికి నెడుతూ శరీర పైభాగాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. ఇలా చేతులు నిటారుగా వచ్చేంత వరకు మీ శరీరాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో కేవలం కాళ్లు, చేతులు మాత్రమే నేలకు తాకి ఉంటాయి.. మిగతా శరీరమంతా గాల్లోనే ఉంటుంది. ఇది చూడ్డానికి ‘తిరగేసిన ‘U’ మాదిరిగా ఉంటుంది.
- ఈ భంగిమలో చేతులు, భుజాలు, కాళ్ల పైనే శరీర భారమంతా పడుతుంది. ఇలా ఈ పోజ్‌లో ఉన్నప్పుడు శ్వాస పైనే ధ్యాస పెట్టాలి. ఇలా 5-10 సార్లు శ్వాస తీసుకోవడం, వదలడం చేసేంత వరకు ఉండాలి.
- ఆ తర్వాత వెన్నెముకను నెమ్మదిగా కిందికి తీసుకొస్తూ నేలకు ఆనించాలి. ఆపై రెండు చేతుల్ని యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఈ ఆసనం వేశాక కొన్ని నిమిషాల పాటు అలాగే యోగా మ్యాట్‌పై రిలాక్సవడం మంచిది.
ప్రయోజనాలెన్నో!
|
వీళ్లు చేయొద్దు!
ఇదీ చదవండి: శ్వాస సమస్యలా?.. ఈ ఆసనం ట్రై చేయండి! |