చండ్రు, జుట్టు పొడిబారడం, రాలడం, నెరవడం వంటి సమస్యలను గోరింటాకుతో నియంత్రించవచ్చు. అంతేకాకుండా ఒత్తైన జుట్టుకు ఇది ఉపయోగపడుతుంది.
ఎలా చేయాలంటే..?
ఒత్తుగా పెరిగేందుకు.. గోరింటాకు పొడి (హెన్నా)లో కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు కాస్తంత చక్కెరవేసి తలకు పట్టించాలి. రెండు గంటల తర్వాత కడిగేయాలి.
చుండ్రు పోయేందుకు.. హెన్నాలో కాస్తంత టీపొడి, నీళ్లు పోసి ఏడెనిమిది గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తలకు రాయాలి. ఇలా చేసే ముందు కొబ్బరినూనె రాసుకుంటే మంచిది.
నెరుపు తగ్గేందుకు.. ఈ సమస్య తగ్గాలంటే.. కాస్తంత గోరింటాకు పొడిలో కొద్దిగా మెంతిపొడి వేసి, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి గంట తర్వాత కడిగేయాలి. దీన్ని క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల నెరుపు క్రమంగా తగ్గుతుంది.
ఇదీ చదవండి: 'రాజకీయ బీభత్సం సృష్టించేందుకే ఇలాంటి చర్యలు'