ETV Bharat / lifestyle

'ప్రతి కష్టానికో థాంక్స్​ చెప్పి... గెలిచింది' - An inspiring story

చదువుకోవడానికి డబ్బులు లేకపోతే.. తోటిపిల్లలకు ట్యూషన్లు చెప్పింది..  హాస్టల్‌ ఫీజు కోసం నేతపని చేసింది..  కానీ కష్టం వచ్చిన ప్రతిసారీ దానికో ‘థాంక్స్‌’ చెప్పింది. తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారు సర్కారీ కొలువులు సాధించేందుకు కావాల్సిన స్ఫూర్తిని రగిలిస్తోంది గంజి భాగ్యలక్ష్మి.

story on professor difficulties in her life Khammam

author img

By

Published : Mar 4, 2021, 12:21 PM IST

జీవితానికి మించిన ఎన్‌సైక్లోపీడియా మరొకటి లేదంటుంది తెలంగాణ ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి. చదువుకోవడం కోసం చిన్నప్పట్నుంచీ పోరాటమే చేసిందామె. డిగ్రీలో చేరడానికి ఎన్నో కష్టాలు పడిన భాగ్యలక్ష్మి వాటిని ఆత్మస్థైర్యంతో ఎదిరించి ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఫిల్‌ చేసి శెభాష్‌ అనిపించుకుంది.

‘మాది నల్గొండ జిల్లా హాలియా. మేం ఐదుగురు సంతానం. ఒక అన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ నాకు చదువంటే ఇష్టం. ఇంటర్‌లో నేనే కాలేజ్‌ టాపర్‌ని. మా ఊరిలో అక్కడి వరకే ఉండటంతో డిగ్రీ చదవడానికి నల్గొండ వెళ్లాల్సిందే. కానీ ఆర్థిక సమస్యలు, దూరం వల్ల అమ్మానాన్న వద్దన్నారు. దాంతో ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఆ వచ్చిన డబ్బుతో నల్గొండలోని డిగ్రీ కళాశాలకు దరఖాస్తు చేసుకుంటే సీటొచ్చింది. ఇంట్లో కూడా సరేనన్నారు. కానీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి డబ్బులు కావాలిగా. అందుకోసం అక్కడ కూడా ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బుతో హాస్టల్‌ ఫీజు కట్టేదాన్ని. అంత చేసినా డబ్బు చాలకపోయేసరికి డిగ్రీలో మొదటి సంవత్సరం పూర్తవ్వగానే చదువు చాలన్నారు. దీంతో చేసేదిలేక మా కులవృత్తి అయిన నేతపని నేర్చుకుని కార్మికురాలిగా చేరా. కానీ చదువు మీద ఇష్టంతో డబ్బులు దాచుకుని చాలా కష్టాలు పడి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశా. 2008లో జూనియర్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. నాకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డా’ అంటారామె.

ఆత్మనిబ్బరంగా ఉండాలని... తాను పడ్డ కష్టాలు, ఇబ్బందులు మరొకరు పడకూడదు అన్న ఉద్దేశంతో మోటివేషనల్‌ స్పీకర్‌గా మారిన భాగ్యలక్ష్మి... ఇంతవరకూ 110 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు కావాల్సిన సహకారాన్ని అందించారు. ‘నా దగ్గర చదువుకున్న విద్యార్థులు నాతో స్నేహంగా ఉండేవారు. చాలామంది వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు. నాకున్న శక్తి మేరకు వాటిని పరిష్కరించేదాన్ని. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడినవారు, సరైన దిశానిర్దేశం లేనివారికి ప్రభుత్వ కొలువు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలని ఉచితంగా నేర్పించేదాన్ని. ఆ క్రమంలోనే నేనో మోటివేషనల్‌ స్పీకర్‌గా మారా. గత ఏడేళ్లలో 110 మంది వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి కావాల్సిన నైపుణ్యాలని అందించా’ అనే భాగ్యలక్ష్మి ప్రస్తుతం తాను పనిచేస్తున్న కళాశాలలో ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకున్నారు. మహిళా సాధికారత, హక్కులపై చర్చించేందుకు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లోనూ పాల్గొన్నారు. ‘ఎద గీతికలు’ పేరుతో కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన ఈమె సాహిత్యంలో జాతీయ స్థాయి అవార్డులనీ అందుకున్నారు.

ఇదీ చూడండి:

'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.