ETV Bharat / jagte-raho

సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్​లో సైబర్ నేరానికి పాల్పడిన విశాఖపట్నం వాసిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి మూడు బ్యాంకు ఖాతాల నుంచి 36 లక్షల రూపాయలను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
author img

By

Published : Nov 2, 2020, 11:58 PM IST

హైదరాబాద్​లో ఓ వ్యాపారి బ్యాంకు ఖాతాల నుంచి 36 లక్షల రూపాయలు కాజేసిన సైబర్ నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కోల్​కతాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయగా, తాజాగా విశాఖపట్నం వాసి చిరంజీవిని అరెస్ట్ చేశారు. వ్యాపారికి చెందిన సిమ్ కార్డును స్వాపింగ్ చేసి నగదు లావాదేవీల వివరాలు చరవాణి, మెయిల్​కు సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

సెప్టెంబర్ నాలుగో తేదీ తన ఖాతాల్లో డబ్బులు పోయాయని గుర్తించిన వ్యాపారి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు చిరంజీవి ఓ బ్యాంకు ఖాతాను తెరిచి సైబర్ నేరగాళ్లతో నగదును తన ఖాతాలోకి బదిలీ అయ్యేలా ఒప్పందం చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.