ETV Bharat / jagte-raho

తెలంగాణ: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి - తెలంగాణలో రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

women farmers attacked Revenue officer in Telangana

author img

By

Published : Nov 3, 2020, 3:36 PM IST

Updated : Nov 3, 2020, 4:57 PM IST

15:34 November 03

తెలంగాణ: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలో రెండేళ్ల కిందట జరిగిన భూ ప్రక్షాళనలో భాగంగా భూమిని రికార్డుల్లో తక్కువగా నమోదు చేసిన అప్పటి వీఆర్వోపై బాధిత రైతులు చెప్పులతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. మండల పరిధిలోని కప్పర్ల గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు మూడెకరాల 12 గుంటలకు బదులు రెండెకరాల 37 గుంటలతో పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. పొన్నారికి చెందిన మరో రైతు పెద్దస్వామి మూడెకరాల 25 గుంటలకు బదులు ఎకరం 20 గుంటలతో పట్టా జారీ అయింది.

విషయం తెలిసిన బాధిత రైతులు తక్కువగా వచ్చిన భూమిని సరిచేయాలంటూ అప్పటి నుంచే వీఆర్వో రోహిత్‌ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. తాంసి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే  ఇటీవల ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో రోహిత్‌ మొత్తానికే చేతులెత్తేశాడు.

ఈరోజు తాంసి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌పై రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధుల అవగాహన కోసం అధికారులు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోహిత్ వచ్చాడని సమాచారం తెలుసుకున్న బాధిత రైతులు వచ్చి నిలదీశారు. ఈ సమయంలో రోహిత్‌... తమతో దురుసుగా మాట్లాడడని ఆగ్రహించిన మహిళా రైతులు... చెప్పులతో దాడి చేశారు. తహసీల్దార్​, ప్రజాప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. మళ్లీ సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.

Last Updated : Nov 3, 2020, 4:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.