ETV Bharat / jagte-raho

కారు డ్రైవర్ మృతిపై అనుమానాలు... ఆ నలుగురిపై అనుమానం.... - car driver mysterious death Today News

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం మండలంలోని పూజారివారి పల్లికి చెందిన జగన్నాథ్ అనుమానాస్పద రీతిలో విశాఖపట్నం బీచ్​లో మృతి చెందిన కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్థులు ధర్నా చేపట్టారు.

కారు డ్రైవర్ మృతి కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ధర్నా

author img

By

Published : Oct 22, 2020, 5:13 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో రెండు రోజుల క్రితం మండలంలోని పూజారివారి పల్లికి చెందిన జగన్నాథ్ అనుమానాస్పద మృతి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

కారు డ్రైవర్​గా విహార యాత్రకు..

రెండు రోజుల క్రితం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి జగన్నాథ్​ను కారు డ్రైవర్​గా విహార యాత్ర కోసం తీసుకెళ్లారని గ్రామస్థులు తెలిపారు. అక్కడే అనుమానాస్పద రీతిలో జగన్నాథ్ మృతి చెందడం పలు అనుమానాలకు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ నలుగురిని విచారించాలి..

జగన్నాథ్ వస్తువులు సహా కారుతో అదే రోజు గ్రామానికి తిరిగి వచ్చిన నలుగురిని పోలీసులు విచారించాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.

అనుమానాలకు తావిస్తోంది..

కేవలం విహారయాత్రకు కారు డ్రైవర్​గా వెళ్లిన వ్యక్తి.. విగత జీవిలా తిరిగి రావటం పలు అనుమానాలకు తావిస్తోందని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో పోస్టుమార్టం అనంతరం.. జగన్నాథ్ భౌతిక కాయాన్ని గ్రామానికి తీసుకువస్తున్న నేపథ్యంలో గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఫలితంగా అంగళ్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రమలకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

కారు డ్రైవర్ మృతి కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ధర్నా
కారు డ్రైవర్ మృతి కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ధర్నా

ఇవీ చూడండి : వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.