ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్ట్.. 32 బైక్​లు స్వాధీనం

అనంతపురం పట్టణంలో ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ముఠాను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 10 లక్షల విలువగల 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్ట్.. 32 బైక్​లు స్వాధీనం
ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్ట్.. 32 బైక్​లు స్వాధీనం
author img

By

Published : Oct 17, 2020, 4:15 PM IST

పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముఠాను అనంతపురం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల 52 వేలు విలువ చేసే 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఠాగా ఏర్పడ్డారు..

రాప్తాడు మండలం భోగినేపల్లికి చెందిన ముత్యాలు, గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన ప్రసాద్​తో పాటు మరో వ్యక్తి ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగలించే వారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలను ఎత్తుకెళ్లేవారు. వాహనాల చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్న ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. కీలకమైన సమాచారం మేరకు గుత్తి రోడ్డులో ఉన్న ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

జువైనల్ బోర్డులో హాజరు ..

ముఠా నాయకుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ సత్య ఏసుబాబు వెల్లడించారు. నేరగాళ్ల బృందంతో సంబంధం కలిగిన మైనర్​ను అదుపులోకి తీసుకుని జువైనల్ బోర్డు ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. మరోవైపు యువకులు క్రికెట్ బెట్టింగ్​ల వైపు వెళ్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈజీ మనీ కోసం వెళ్లి ఉచ్చులో పడవద్దని.. విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 57 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేససామన్నారు. అందులో 151 మందిని అరెస్టు చేసి, రూ. 8 లక్షల 34 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి:

12 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.