హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేని ఆలం పరిధిలో విషాదం చోటుచేసుకొంది. వర్షానికి రేకుల ఇల్లు కూలిపోయింది. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని వెలికి తీశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు తుదిశ్వాస విడిచారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షానికి పాత రేకుల ఇల్లు కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలిలోని భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: