ETV Bharat / jagte-raho

అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన ఈడీ

అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ మోపిన అభియోగాల ఆధారంగా అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్​ను ఈడీ అరెస్టు చేసింది.

ed arrested
ed arrested
author img

By

Published : Dec 23, 2020, 3:08 AM IST

అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్​ను ఈడీ అరెస్టు చేసింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది నుంచి... రూ. 6,380కోట్లు మోసానికి పాల్పడినట్టు అగ్రిగోల్డ్​పై అభియోగాలు ఉన్నాయి. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, ఛార్జిషీట్ల ఆధారంగా హైదరాబాద్​లో ఈడీ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్​ను ప్రశ్నించిన ఈడీ... వారిని అరెస్టు చేసింది.

ఇదీ చూడండి:

ఒక్కో ప్రధాన కార్యదర్శికి 5 లోక్​సభ స్థానాల బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.