తెలంగాణలోని నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్కు చెందిన ప్రసాద్‌ను ఇటీవల దొంగతనం కేసులో మాక్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితునికి కోర్టు రిమాండ్ విధించడం వల్ల సారంగాపూర్ జైలులో ఉంచారు. కాగా అతను నిన్న అనారోగ్యానికి గురవడం వల్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అయితే అతను రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి హాండ్కప్స్ ఉండగానే తుపాకీతో పారిపోయాడు. సిబ్బంది సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి