ETV Bharat / jagte-raho

సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య.. ఛేదించిన పోలీసులు

author img

By

Published : Dec 11, 2019, 9:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండల ప్రత్తిపాడులో డిసెంబర్ 1న జరిగిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హత్య కేసు వివరాలను కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి వెల్లడించారు.

The police arrested the accused in the railway employee's murder in eastgodavari district
పశ్చిమగోదావరి రైల్వే ఉద్యోగి హత్య కేసును వివరిస్తున్న కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి
సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య..ఛేదించిన పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులో రైల్వే టెలికాం డిపార్ట్​మెంట్​లో సీనియర్ టెక్నీషియన్​గా పనిచేస్తున్న సుజిత్ కుమార్​ను హత్య చేయించింది అదే డిపార్ట్​మెంట్​కు చెందిన
సీనియర్ టెక్నీషియన్ ఆరేటి సాయి శ్రీనివాస్​గా తమ విచారణలో తేలిందని రాజేశ్వరరెడ్డి తెలిపారు. సుజిత్ కుమార్, సాయి శ్రీనివాస్​లకు డిపార్ట్​మెంట్ పరంగా విభేదాలున్నాయి. ఈ కారణంగానే శ్రీనివాస్ హత్యకు ప్లాన్ చేశాడని డీఎస్పీ తెలిపారు.

మాటు వేసి మరీ..
సాయి శ్రీనివాస్ తన స్నేహితులైన ఆరుగురు వ్యక్తులతో ఈ హత్యచేయించాడని పోలీసులు విచారణలో తేలింది. ఈనెల 1వ తేదీ అర్థరాత్రి ప్రత్తిపాడు రైల్వే గేటు వద్ద టెలిఫోన్ సమస్య వచ్చేలా చేశారు. సాయి శ్రీనివాస్ నిడదవోలు రైల్వే జూనియర్ ఇంజినీర్ పాలికల లోకేష్ కుమార్ సహకారంతో సుజిత్​ను అక్కడకు రప్పించారు. అప్పటికే శ్రీనివాస్ ఆరుగురు వ్యక్తులను ఆటోలో ఇరగవరం నుంచి తాడేపల్లిగూడెం రప్పించాడు. రైల్వే గేటు వద్దకు వచ్చిన సుజిత్​పై మాటు వేసిన నిందితులు మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అతనిపై కూర్చుని బలవంతంగా కాళ్ళు, చేతులూ కట్టేశారన్నారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. హత్య అనంతరం మృతుని వద్ద పర్సులోని నగదు, ఉంగరం, సెల్​ఫోన్ తీసుకువెళ్లారన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక విసిరేసి పరారయ్యారని తమ విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆరేటి సాయి శ్రీనివాస్.. చామకూరి నాగేంద్ర, మంగిన శ్రీనివాస్, వర్థినీడి గోపాలం, వలవల రామాంజనేయులు, ఆరేటి బ్రహ్మయ్య, కొమ్ముల నాగ సతీష్​తో హత్య చేయించాడన్నారు. ఈ ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనం, నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

దర్యాప్తు బృందానికి ప్రశంస...
ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ రవికుమార్, టౌన్ సి.ఐ ఆకుల రఘు, పెంటపాడు ఎస్సై శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై కె.వై.దాస్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండీ:

భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య..ఛేదించిన పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులో రైల్వే టెలికాం డిపార్ట్​మెంట్​లో సీనియర్ టెక్నీషియన్​గా పనిచేస్తున్న సుజిత్ కుమార్​ను హత్య చేయించింది అదే డిపార్ట్​మెంట్​కు చెందిన సీనియర్ టెక్నీషియన్ ఆరేటి సాయి శ్రీనివాస్​గా తమ విచారణలో తేలిందని రాజేశ్వరరెడ్డి తెలిపారు. సుజిత్ కుమార్, సాయి శ్రీనివాస్​లకు డిపార్ట్​మెంట్ పరంగా విభేదాలున్నాయి. ఈ కారణంగానే శ్రీనివాస్ హత్యకు ప్లాన్ చేశాడని డీఎస్పీ తెలిపారు.

మాటు వేసి మరీ..
సాయి శ్రీనివాస్ తన స్నేహితులైన ఆరుగురు వ్యక్తులతో ఈ హత్యచేయించాడని పోలీసులు విచారణలో తేలింది. ఈనెల 1వ తేదీ అర్థరాత్రి ప్రత్తిపాడు రైల్వే గేటు వద్ద టెలిఫోన్ సమస్య వచ్చేలా చేశారు. సాయి శ్రీనివాస్ నిడదవోలు రైల్వే జూనియర్ ఇంజినీర్ పాలికల లోకేష్ కుమార్ సహకారంతో సుజిత్​ను అక్కడకు రప్పించారు. అప్పటికే శ్రీనివాస్ ఆరుగురు వ్యక్తులను ఆటోలో ఇరగవరం నుంచి తాడేపల్లిగూడెం రప్పించాడు. రైల్వే గేటు వద్దకు వచ్చిన సుజిత్​పై మాటు వేసిన నిందితులు మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అతనిపై కూర్చుని బలవంతంగా కాళ్ళు, చేతులూ కట్టేశారన్నారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. హత్య అనంతరం మృతుని వద్ద పర్సులోని నగదు, ఉంగరం, సెల్​ఫోన్ తీసుకువెళ్లారన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక విసిరేసి పరారయ్యారని తమ విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆరేటి సాయి శ్రీనివాస్.. చామకూరి నాగేంద్ర, మంగిన శ్రీనివాస్, వర్థినీడి గోపాలం, వలవల రామాంజనేయులు, ఆరేటి బ్రహ్మయ్య, కొమ్ముల నాగ సతీష్​తో హత్య చేయించాడన్నారు. ఈ ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనం, నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

దర్యాప్తు బృందానికి ప్రశంస...
ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ రవికుమార్, టౌన్ సి.ఐ ఆకుల రఘు, పెంటపాడు ఎస్సై శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై కె.వై.దాస్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండీ:

భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

Intro:..Body:పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండల ప్రత్తిపాడు ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక డిసెంబర్ 1న జరిగిన మర్డర్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మర్డర్ జరిగిన వివరాలు కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వరెడ్డి వెల్లడించారు. రైల్వే టెలికాం డిపార్ట్మెంట్లో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న సుజిత్ కుమార్ ను హత్య చేయించింది తణుకుకు చెందిన ఇదే డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ టెక్నీషియన్ ఆరేటి సాయి శ్రీనివాస్ గా తమ విచారణలో తేలిందని తెలిపారు. సుజిత్ కుమార్ సాయి శ్రీనివాస్ లకు డిపార్ట్మెంట్ పరంగా ఉన్న విభేదాల కారణంగానే ఈ హత్యకు శ్రీనివాస్ ప్లాన్ చెసాడని డిఎస్పీ తెలిపారు. సాయి శ్రీనివాస్ తన స్నేహితులైన ఆరుగురు వ్యక్తులతో ఈ హత్యచేయించాడన్నారు. 1వ తేదీ అర్థరాత్రి ప్రత్తిపాడు రైల్వే గేటు వద్ద టెలిఫోన్ సమస్య వచ్చేలా చేసి సాయి శ్రీనివాస్ నిడదవోలు రైల్వే జూనియర్ ఇంజినీర్ పాలికల లోకేష్ కుమార్ సహకారంతో సుజిత్ ను అక్కడకు రప్పించారని తెలిపారు. అప్పటికే శ్రీనివాస్ ఆరుగురు వ్యక్తులను ఆటోలో ఇరగవరం నుంచి తాడేపల్లిగూడెం రప్పించాడన్నారు. రైల్వే గేటు వద్దకు వచ్చిన సుజిత్ పై మాటువేసిన నిందితులు ఆరుగురూ మూకుమ్మడిగా దాడిచేసారన్నారు. అతనిపై కూర్చుని బలవంతంగా అతని కాళ్ళు, చేతులూ కట్టేసారన్నారు. అతన్ని ఊపిరాడకుండా చేసి హత్యచేసారన్నారు. హత్య అనంతరం మృతుని వద్ద ఉన్న పర్సులో ఉన్న నగదు, ఉంగరం, సెల్ ఫోన్ తీసుకువెళ్లారన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక విసిరేసి పరారయ్యారని డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆరేటి సాయి శ్రీనివాస్ చామకూరి నాగేంద్ర, మంగిన శ్రీనివాస్, వర్ధినీడి గోపాలం, వలవల రామాంజనేయులు, ఆరేటి బ్రహ్మయ్య, కొమ్ముల నాగ సతీష్ తో హత్య చేయించాడన్నారు. అదే విధంగా నిడదవోలుకు చెందిన టెలికాం జూనియర్ ఇంజినీర్ పాలికల లోకేష్ కుమార్ సహకారంతో ఈ హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నామని డిఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనం, నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ ఇన్స్పెక్టర్ రవికుమార్, టౌన్ సి.ఐ ఆకుల రఘు, పెంటపాడు ఎస్సై శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై కె.వై.దాస్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని డిఎస్పీ తెలిపారు.Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.