తెలంగాణ రాష్ట్రం ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగమేశ్వర ఆలయ భూముల్లో స్థానిక సర్పంచ్ ఇల్లు నిర్మించాడని... తొలగించేందుకు రెవెన్యూ, దేవాదాయ సిబ్బంది ప్రయత్నించారు. అధికారులను స్థానికులు అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భార్య.. మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. సంగమేశ్వర ఆలయ భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తేల్చారు. తొలగించేందుకు వస్తే తమపై దాడి చేయడం సరికాదని వెల్లడించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.... రెవెన్యూ, దేవాదాయ సిబ్బంది వెనుదిరిగారు. ఆర్డీఓతో పూర్తిస్థాయి విచారణ జరిపించి... ఎలా ముందుకెళ్లాలన్నది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు సర్పంచ్ బాలు మాత్రం సర్వే నెంబర్ 1లో గ్రామకంఠం భూమి ఉందని దానిని తమ పూర్వీకుల నుంచి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: