అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ నిర్మాణ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తోన్న చంద్రశేఖర్ మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే హత్య చేసి, విషయాన్ని బయటకు తెలియనివ్వలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం మాత్రం శనివారం తెల్లవారు జామున నిద్రపోతున్న చంద్రశేఖర్‌పై ప్రమాదవశాత్తు రోడ్డు రోలర్ ఎక్కి చనిపోయాడని అంటున్నారు. పోలీసులు విచారణ చేసి నిజానిజాలు వెలికి తీయాలని బంధువులు కోరుతున్నారు
ఇవీ చూడండి : తెదేపా నేత హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి