పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు తమ్మిశెట్టి సత్యనారాయణ (53).. పది సంవత్సరాలుగా అరటి, పామాయిల్ తోటలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం మందలపల్లి పరిసరాల్లో సుమారు 30 ఎకరాలకు పైగా అరటి తోటలు సాగు చేశారు. వ్యవసాయానికి పెట్టుబడులు కోసం బయట అప్పులు చేశాడని కుటుంబీకులు చెబుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా అరటి పంట కొనేవారు లేక తీవ్ర నష్టం వాటిల్లిందని.... కొన్ని రోజులుగా మనో వేదనతో ఉన్నారని వెల్లడించారు. ఇటీవల కుమార్తె వివాహానికి అప్పులు చేశాడని.... అవి తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురై ఉంటాడని అనుమానించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెప్పారు. పోలీసులు సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: