అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్పల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన యాదగిరి... సోని అనే అమ్మాయిని ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నారు. ఇటీవల వారిద్దరూ గొడవ పడగా.. సోనిని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి యాదగిరి వెళ్లిపోయాడు. సోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. యాదగిరి భార్య కోసం అక్కడికి వెళ్లాడు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటున్న సమయంలో సోని బంధువులు యాదగిరి తండ్రిపై దాడి చేశారు.
ఆ ఘటన తర్వాత ఆదివారం ఇరు కుటుంబాలు మాట్లాడుకునేందుకు యాదగిరిని పిలిపించారు. పంచాయతీ వద్ద సోని తండ్రి ఉండగా.. అక్కడికి వచ్చిన యాదగిరి.. పాషాపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మరణించారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులు యాదగిరి ఇంటిని ధ్వంసం చేశారు. అక్కడున్న ట్రాక్టర్ను దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న తూప్రాన్న డీఎస్పీ కిరణ్కుమార్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు