.
కోర్టు సరైన తీర్పు వెల్లడించింది : సమత భర్త - సమత కేసులో భర్త స్పందన
తెలంగాణలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలను దోషులుగా నిర్ధరిస్తూ... ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై స్పందించిన బాధితురాలి భర్త హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. వారికి మరణశిక్ష పడేందుకు కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు అన్నం తినకుండా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఉద్విగ్నంగా చెప్పారు.
సమత భర్త
.