ETV Bharat / jagte-raho

రవి ప్రకాశ్​ ఈ మెయిల్స్​లో.. కీలక సమాచారం??

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు గుర్తించారు. రవిప్రకాశ్​ నుంచి పలువురికి బదిలీ అయిన మెయిళ్లను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రవిప్రకాశ్​ వాటిని తొలగించినట్టు తెలుస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని తిరిగి వెలికితీసే పనిలో విచారణ సిబ్బంది ఉన్నారు.

RAVIPRAKASH
author img

By

Published : May 16, 2019, 3:02 PM IST

రవి ప్రకాశ్​ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రవిప్రకాశ్‌, నటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని పోలీసులు అంచనాకు వచ్చారు. రవిప్రకాశ్, శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ సన్నిహితుడు హరి, ఎబీసీఎల్​ మాజీ ఫైనాన్స్ అధికారి మూర్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్‌ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు వాటిని తొలగించినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు.

నకిలీ పత్రాల గుర్తింపు

రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్‌ 13, 2019న తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్‌ చేసిన శక్తి... రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, హరిలకూ కాపీలు పంపినట్లు సమాచారం. వీరందరి మధ్య మెయిళ్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు పంపారు.

సర్వత్రా ఆసక్తి

ఇక.. శివాజీ ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు. ఏప్రిల్‌14, 2019న ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్‌లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం 9 గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్‌, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్‌లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

విచారణ 12కు వాయిదా..

ఏబీసీఎల్ షేర్ల అమ్మకం వ్యవహారంలో రవిప్రకాశ్‌ పిటిషన్‌పై విచారణను జులై 12కు వాయిదా వేసింది ఎన్‌సీఎల్‌టీ. ​ పిటిషన్​పై వాదనలు వినిపించాలని చింతలపాటి, ఐల్యాబ్స్, అలంద మీడియాకు నోటీసులు జారీ చేసింది. రవిప్రకాశ్ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ స్వీకరించడం పట్ల అలంద మీడియా పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది.

ఇవీ చూడండి: మల్లన్న సాగర్​ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.