భారీగా ఎర్రచందనం పట్టివేత కడప జిల్లాలో ఎర్రచందనం ప్రత్యేక టాస్క్ఫోర్స్ దాడుల్లో ఐదుగురు స్మగ్లర్లు అరెస్టయ్యారు. చెన్నూరు మండలం కైలాసగిరి నుంచి దుంగలు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వి తప్పించుకునేందుకు యత్నించారు. అనంతరం పోలీసులకు ఐదుగురు చిక్కగా.. మరో ఇద్దరు పరారయ్యారని డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. 30 లక్షలు విలువ చేసే కలప, నాలుగు కార్లు, ఆరు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో లాల్ భాష అనే వ్యక్తిపై 46 కేసులున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి...108 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... 9 మంది అరెస్ట్