శంషాబాద్ బాహ్యవలయ రహదారిపై అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న గోల్కొండ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ఓఆర్ఆర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి డ్రైవర్ వెంటనే కిందకు దూకేశాడు.
ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: