ETV Bharat / jagte-raho

అత్తింటి వేధింపులు... మందమర్రిలో గర్భిణి ఆత్మహత్య! - pregnant women commits suicide at mancherial district

కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా వేధింపులే ఎదురయ్యాయి. అదనపు కట్నం కోసం కట్టుకున్నవాడు నిత్యం వేధించాడు. అత్తామామలు సూటిపోటి మాటలతో మనసు గాయపరిచారు. మూడు నెలల గర్భిణి అని చూడకుండా వేధిస్తుండడంతో ఆ నిస్సహాయురాలు భరించలేకపోయింది. చివరికి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

pregnant-woman
pregnant-woman
author img

By

Published : Feb 8, 2021, 3:47 PM IST

తెలంగాణ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రవళి(25)తో మందమర్రికి చెందిన తిరుపతికి అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. దాదాపు రూ.10 లక్షలు కట్నకానుకలు ఇచ్చారు. వారికి కుమారుడు కన్నయ్య(2) ఉండగా.. ప్రస్తుతం రవళి మూడునెలల గర్భిణి. కొడుకు అనారోగ్యం కారణంగా చికిత్సకు రూ.8 లక్షలు ఖర్చయ్యింది.

ఈ క్రమంలో మరికొంత కట్నం తీసుకురావాలంటూ ఆమెను భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారు. అదనంగా డబ్బులు ఇచ్చేందుకు రవళి తల్లిదండ్రులు ఒప్పకున్నా చెల్లింపులో కొంత జాప్యం జరిగింది. దీంతో ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఆదివారం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తీవ్ర గాయాలైన ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. రవళి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పెరుగుతున్న భూతాపం- హిమాని నదులకు పెనుశాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.