ETV Bharat / jagte-raho

స్నేహితుల చేతిలో రౌడీ షీటర్ హతం

స్నేహితుడిని హత్య చేశాడు.. చివరికి స్నేహితులే చంపేశారు!

author img

By

Published : Dec 26, 2020, 10:55 PM IST

Updated : Dec 27, 2020, 11:22 AM IST

22:54 December 26

రగిలిన ఆధిపత్య పోరు!!

విశాఖలోని ఆరిలోవలో శనివారం రాత్రి ఓ రౌడీషీటర్‌ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి సంఘటన జరగడం పోలీసులను విస్మయానికి గురి చేసింది. అయితే స్నేహితుల మధ్య ఆధిపత్య పోరువల్లే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఆరిలోవ శాంతిభత్రదల ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

రవీంద్రనగర్‌కు చెందిన కోరాడ సాయి (35) ఆరిలోవ గవర్నమెంట్‌ ఆసుపత్రి వెనుక వీధిలో నివాసం ఉంటేవాడు. సాయి గతంలో ఆరిలోవలో జరిగిన చిత్తిని రవి అనే యువకుని హత్యకేసులో నిందితుడు. దీనివల్ల సాయిని ఎక్కువ మంది మర్డర్‌ సాయిగా పిలుస్తారు. అయితే పాతమిత్రుల మధ్య ఏర్పడిన పొరపొచ్చాల కారణంగా ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు సాయి ఆరిలోవ టీఐసీ పాయింట్‌ ప్రాంతానికి మకాం మార్చాడు. ఇది కూడా ఘర్షణలు పెరగడానికి మరింత దోహదం చేసిందని చెప్తున్నారు. 

శనివారం రాత్రి వెంకటేశ్వరస్వామి ఆలయం వీధిలో నీళ్లకుండి వద్ద పాత స్నేహితులతో రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్లీ ఘర్షణ జరిగింది. ఘర్షణలో సాయిని రాడ్డుతో తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటనలో ముగ్గురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే చినగదిలి పినాకిల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 

అత్యాచారం చేసి.. రైలులోంచి నెట్టేసి..

Last Updated : Dec 27, 2020, 11:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.