ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో యువతుల నగ్న చిత్రాల సేకరణ

యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని... నగ్న చిత్రాలు సేకరిస్తున్న వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన క్లెమెంట్​ రాజ్​ 16 రాష్ట్రాలకు చెందిన యువతులను క్వికర్​ డాట్​ కామ్​లో ఉద్యోగాల పేరిట మోసం చేశాడు.

miyapur-police-arrested-a-man-in-the-case-of-women-cheating-case
author img

By

Published : Aug 24, 2019, 1:17 PM IST

ఉద్యోగాల పేరుతో యువతుల నగ్న చిత్రాలు సేకరిస్తున్న వ్యక్తిని తెలంగాణలోని... మియాపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన క్లెమెంట్​ రాజ్ ఉద్యోగాల కోసం సామాజిక మాధ్యమాల్లో ఉంచే మహిళల చరవాణి నంబర్లను సేకరించేవాడు. అనంతరం వారిని ఫోన్​లో సంప్రదించి రాడిసన్​ హోటల్​ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని నగ్న చిత్రాలు పంపాలని వేధించాడు. ఇలా 16 రాష్ట్రాలకు చెందిన యువతులను క్వికర్ డాట్​ కామ్​ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. క్లెమెంట్​రాజ్​ తమిళనాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.

Intro:TG_ADB_33_23_KRUSHNASHTAMI_AV_TS10033
అట్టహాసంగా కృష్ణాష్టమి వేడుకలు...
నిర్మల్ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆలయాలు , ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో శ్రీకృష్ణ వేషధారణలతో అలరించారు .పట్టణంలోని వాసవి పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని చిన్నారులు గోపిక రాధాకృష్ణల వేషధారణతో అందరిని ఆకట్టుకున్నారు. కోలాటాలు, క్షీరసాగరమధనం , ఉట్టి కొట్టుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కనువిందు చేశారు

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.