ETV Bharat / jagte-raho

పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య

తమ కూతురు, అల్లుడు బంగారు భవిష్యత్తును ఊహించుకుంటున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అడ్డుకట్టపడింది. పెళ్లైన ఆరు నెలలకే కన్నవారికి ఆమె కడుపుకోతను మిగిల్చింది. ఈ ఘటన చందానగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య
పెళ్లైన ఆరునెలలకే విపెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్యవాహిత ఆత్మహత్య
author img

By

Published : Oct 18, 2020, 9:51 PM IST

పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్​కు చెందిన శబరిష్​కు కరీంనగర్​కు చెందిన శ్రీ విద్యతో ఆరునెలల క్రితం వివాహమైంది. భర్త పని మీద బెంగళూర్​ వెళ్లడంతో... శ్రీవిద్య చందానగర్​లోని వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లింది.

శనివారం మధ్యాహ్నం భర్త శబరిష్​తో ఫోన్​లో మాట్లాడిన ఆమె... అతనితో గొడవపడి భవనంపై నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన శ్రీవిద్యను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ... శ్రీవిద్య ఆదివారం మృతి చెందింది.

భార్య మృతికి... శబరిష్ వేధింపులే కారణమని శ్రీవిద్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.