తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దెగాంలో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. యువకుడు గోడేం శ్రీరాం మృతి చెందగా.. యువతి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉంది.
ఒకే కులానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటం వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి