ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట కథ విషాదాంతం అయింది. కలిసి బతకలేని పరిస్థితుల్లో చావే శరణ్యమనుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరిచలేదని యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువులో జరిగింది.
మొద్దులచెరువు శివారులో ఉరేసుకుని యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడు చివ్వెంల మండలం చందుపట్ల వాసి ఓర్సు నవీన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు సూర్యాపేట పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణ : రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి