మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని అనంతపురం జిల్లా విడపనకల్ వద్ద పాల్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 787 టెట్రా ప్యాకెట్లు, మద్యంతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హవలిగి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వేర్వేరుగా రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న మద్యం పట్టుబడింది.
అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఇద్దరు ఉండబండ గ్రామానికి చెందినవారు కాగా మిగతా ముగ్గురు చీకులగురికి గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపిన సీఐ...ఎవరైనా ఇలా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి'