ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో కిడ్నాప్​ చేశారు.. జగిత్యాలలో చిక్కారు.. - etv bharat

పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి పట్టుకోవడం సినిమాల్లో చూస్తాం కాని.. తెలంగాణ.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల శివారులో పోలీసులు నిజంగానే కిడ్నాపర్లను వెంబడించి పట్టుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు పైచేయి సాధించారు. నిందితులను అరెస్టు చేశారు.

kidnap
kidnap
author img

By

Published : Oct 6, 2020, 8:24 AM IST

తెలంగాణ.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన రాజ భూషణానికి సరూర్​నగర్ చెందిన నాగభూషణంకు మధ్య డబ్బుల లావాదేవీలు కొనసాగుతున్నాయి. రాజ భూషణానికి నాగభూషణం ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. విసుగు చెందిన రాజ భూషణం అజీజ్ అనే రౌడీ షీటర్​తో కలిసి కిడ్నాప్ వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా సోమవారం సరూర్​నగర్​లో ఐదుగురు దుండగులు నాగభూషణాన్ని కిడ్నాప్ చేశారు. వారు టీఎస్​ 08 ఎఫ్​హెచ్​ 7577 నెంబరు గల కారులో జగిత్యాల వైపు బయల్దేరారు.

ఇది గుర్తించిన నాగభూషణం కుటుంబ సభ్యులు సరూర్​నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. జగిత్యాల జిల్లా వైపు వచ్చిన నిందితులు కొండగట్టు దొంగల మర్రి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి కారును మరో మార్గంలో అతి వేగంగా తీసుకెళ్లారు. అదే వేగంతో కొడిమ్యాల పోలీసులు వెంబడించి కొడిమ్యాల శివారులో పట్టుకున్నారు. ఐదుగురు దుండగుల్లో ఇద్దరు పారిపోగా... ముగ్గురు పోలీసులకు చిక్కారు.

కిడ్నాపైన నాగభూషణం, నిందితులను పోలీస్ స్టేషన్​కు తరలించారు. సమాచారమందుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిషోర్ కొడిమ్యాల పోలీస్ స్టేషన్​కు చేరుకొని కిడ్నాప్ వివరాలను తెలుసుకున్నారు. దుండగులను పట్టుకున్నట్లు సరూర్​నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​: ముంబయి వేగాన్ని రాయల్స్​ ఆపగలదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.