ETV Bharat / jagte-raho

నకిలీ బంగారు నాణేలతో రూ.9 లక్షలు టోకరా.. పట్టుకున్న పోలీసులు - నకిలీ బంగారం నాణేలతో మోసం

నకిలీ బంగారు నాణేల పేరుతో జరిగిన మోసాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ బంగారు నాణేలతో 9లక్షలకు టొకరా
author img

By

Published : Nov 7, 2019, 2:43 PM IST

నకిలీ బంగారు నాణేలతో రూ.9 లక్షలు టోకరా.. పట్టుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా ఉరవకొండలో నకిలీ బంగారు నాణేల పేరుతో జరిగిన మోసాన్ని పోలీసులు ఛేదించారు. హైదరాబాద్​కు చెందిన సత్యం అనే వ్యక్తికి అంజినప్ప, విజయ్​లు మాటలు కలుపుతూ తమ వద్ద బంగారు నాణేలు ఉన్నాయని.. వాటిని తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపారు. ఇందులో భాగంగా ముందుగా రెండు అసలు నాణేలను ఇచ్చి సత్యానికి నమ్మకం కల్పించారు. 2 కిలోల నాణేలను రూ.9 లక్షలకే ఇస్తామని చెప్పారు. నమ్మిన సత్యం నాణేలను తీసుకున్నాడు. అనంతరం నాణేలు నకిలీవని గుర్తించిన సత్యం ఉరవకొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఉరవకొండ సమీపంలో గాలిస్తుండగా.. అంజినప్ప, విజయ్​ తప్పించుకుంటూ పోలీసుల కంట పడ్డారు. వారిని వెంబడించటంతో బ్యాగ్ వదిలేసి పరారయ్యారు. బ్యాగ్​లో రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:

సింహాద్రి స్కెచ్‌ వేస్తే ఉచ్చులో పడాల్సిందే...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.