గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కొరిటిపాడు, నాయుడుపేట, ముత్యాలరెడ్డి నగర్లో ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయం పేరుతో దంపతులు రూ. 3.5 కోట్లకు టోకరా వేశారు. తిరుమలశెట్టి వెంకటేశ్, మానస దంపతులు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయం పేరుతో వ్యాపారం నిర్వహిస్తామని మోసానికి పాల్పడ్డారు. వీరికి దాదాపు 25 మంది బాధితులు డబ్బులు చెల్లించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ అర్బన్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: