కృష్ణ జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 వేల రూపాయల నగదు, 7 చరవాణులు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
విలాసాలు వద్దు కష్టఫలమే ముద్దు..
విలాసాలకు అలవాటు పడిన యువత, కష్టపడకుండా సునాయాసంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారని సీఐ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు శిక్షార్హమేనని సీఐ రామచంద్రరావు పేర్కొన్నారు.
కష్టపడి బతకాలి..
సమాజంలో కష్టపడి సంపాదిస్తూ గౌరవప్రదంగా జీవించాలని సీఐ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ సీహెచ్ రంజిత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చూడండి : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్