కర్నూలు జిల్లా అవుకు వద్ద వ్యక్తి హత్య కేసులో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. నలుగురు నిందితుల అరెస్టుతో దారుణం బయటపడింది. ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. 2015లో బనగానపల్లె అవుకు వద్ద వడ్డే సుబ్బారాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాడు.. యజమాని భాస్కర్ రెడ్డి. ఆయన చెప్పినట్టు రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత.. సమయం చూసుకున్న యజమాని భాస్కర్ రెడ్డి.. సుబ్బారాయుడుపై నకిలీ ధృవ పత్రాలు తయారు చేయించుకున్నాడు. నా.. అనే వాళ్లు లేని సుబ్బారాయుడుపై అంతకుముందే పాలసీ చేయించిన ప్రకారం.. 32 లక్షల రూపాయలు దండుకున్నాడు. ఈ హత్యలో భాగం పంచుకున్న వారితో కలిసి డబ్బులు పంచుకున్నాడు. ఇటీవల నిందుతులను అదుపులోకి తీసుకోగా.. ఈ విషయం బయటపడింది. కేసును ఛేదించిన కర్నూలు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
చంపేశారు.. ప్రమాదంగా చిత్రీకరించారు.. 4 ఏళ్లకు దొరికారు! - కర్నూలులో దారుణం
నమ్మించి గొంతు కోయడమంటే అచ్చంగా ఇదే. నా.. అన్న వాళ్లు ఎవరూ లేని వ్యక్తిని పనివాడిగా చేర్చుకున్నాడు. బీమా చేయించి.. చంపేశాడు. చివరికి.. నాలుగేళ్లకు అడ్డంగా దొరికిపోయాడు.
![చంపేశారు.. ప్రమాదంగా చిత్రీకరించారు.. 4 ఏళ్లకు దొరికారు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4236906-133-4236906-1566723120480.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లా అవుకు వద్ద వ్యక్తి హత్య కేసులో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. నలుగురు నిందితుల అరెస్టుతో దారుణం బయటపడింది. ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. 2015లో బనగానపల్లె అవుకు వద్ద వడ్డే సుబ్బారాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాడు.. యజమాని భాస్కర్ రెడ్డి. ఆయన చెప్పినట్టు రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత.. సమయం చూసుకున్న యజమాని భాస్కర్ రెడ్డి.. సుబ్బారాయుడుపై నకిలీ ధృవ పత్రాలు తయారు చేయించుకున్నాడు. నా.. అనే వాళ్లు లేని సుబ్బారాయుడుపై అంతకుముందే పాలసీ చేయించిన ప్రకారం.. 32 లక్షల రూపాయలు దండుకున్నాడు. ఈ హత్యలో భాగం పంచుకున్న వారితో కలిసి డబ్బులు పంచుకున్నాడు. ఇటీవల నిందుతులను అదుపులోకి తీసుకోగా.. ఈ విషయం బయటపడింది. కేసును ఛేదించిన కర్నూలు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రానికి న్యాయం చేస్తుందని నమ్మిన ప్రజలు తమను ఆదరించారని ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రత్యేక హోదా తోపాటు, రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. ధన ప్రవాహంగా మారిన ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
బైట్: చేవూరు దేవ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291