పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వెంకటప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 21స్థిరాస్తులతోపాటు 50 లక్షల నగదును జప్తు చేశారు. వీటి విలువ 7.57 కోట్ల రూపాయలుంటుందని ఈడీ అధికారులు తెలిపారు. పీబీఆర్ పౌల్ట్రీ టెక్ పేరుతో వెంకటప్రసాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 7.34కోట్ల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత పీబీఆర్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో డొల్ల కంపెనీ స్థాపించి తణుకులోని ఆంధ్రాబ్యాంకులో 9.93కోట్ల రుణం తీసుకున్నాడు. పౌల్ట్రీ షెడ్డుల నిర్మాణం కోసం రుణం తీసుకున్న వెంకటప్రసాద్.. వాటిని ఇతర అవసరాల కోసం వినియోగించాడు. రెండు బ్యాంకుల్లో కలిపి 17.24కోట్ల రుణం తీసుకున్న పోలేపల్లి వెంకటప్రసాద్ వాటిని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: అక్రమ లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్