తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎన్ కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇళ్ల స్థలాల పనులకు సంబంధించి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ రాజు... గుత్తేదారు బుజ్జి మధ్య కొద్దిరోజులుగా వివాదం నెలకొంది. ఇళ్ల స్థలాల పనులకు సంబంధించి ఎక్కువ మంది ఉపాధి కూలీలను పెట్టినట్లు నమోదు చేయమని వైకాపా నాయకుడైన బుజ్జి... ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఒత్తిడి పెంచాడు. అందుకు ఫీల్డ్ అసిస్టెంట్ అంగీకరించలేదు. గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ రాగా... వివాదం చెలరేగింది. సమావేశానికి హాజరైన వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు
అమలాపురం నియోజకవర్గం ఎన్ కొత్తపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇళ్ల స్థలాల పనులకు సంబంధించి ఎక్కువ మంది ఉపాధి కూలీలను పెట్టినట్లు నమోదు చేయమని వైకాపా నాయకుడైన గుత్తేదారు ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఒత్తిడి పెంచగా.. అతను అంగీకరించకపోవటంతో ఘర్షణ నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎన్ కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇళ్ల స్థలాల పనులకు సంబంధించి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ రాజు... గుత్తేదారు బుజ్జి మధ్య కొద్దిరోజులుగా వివాదం నెలకొంది. ఇళ్ల స్థలాల పనులకు సంబంధించి ఎక్కువ మంది ఉపాధి కూలీలను పెట్టినట్లు నమోదు చేయమని వైకాపా నాయకుడైన బుజ్జి... ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఒత్తిడి పెంచాడు. అందుకు ఫీల్డ్ అసిస్టెంట్ అంగీకరించలేదు. గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ రాగా... వివాదం చెలరేగింది. సమావేశానికి హాజరైన వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు.
ఇదీ చూడండి: ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు