విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురంలో కారుకు దండుగులు నిప్పు పెట్టారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా కారు దగ్దమైంది. గ్రామానికి చెందిన సూరిశెట్టి వెంకట గణేష్‌కు చెందిన కారును ప్రత్యర్ధులు తగలబెట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో రెండు రోజుల కిందట పశువుల పాకను తగలబెట్టిన సంఘటన నుంచి తేరుకోక ముందే మరొక సంఘటన జరగడంపై చర్చ జరుగుతోంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ డి.లక్ష్మీ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి