ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో జరిగింది. పెనుమూడి గ్రామానికి చెందిన కన్నా పవన్(10) స్థానికంగా ఉన్న కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఈతకు వెళ్ళాడు. నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతయ్యాడు.
స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు నది తీరానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు నదిలో గాలింపు చేపట్టి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఇంటిదగ్గర ఆడుతూ పాడుతూ గడిపిన కుమారుడు విగతజీవిగా కనిపించటంతో కుటుంబసభ్యుల రోదనకు అంతు లేకుండాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: