ETV Bharat / jagte-raho

తెలంగాణలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ వద్ద పేలుడు - bomb blast at hyderabad

తెలంగాణలోని రాజేంద్రనగర్​ ఎక్స్​ప్రెస్​ వే పిల్లర్​ 279 వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి శరీరం ఛిద్రమైంది.

bomb-blast-at-hyderabad
author img

By

Published : Sep 8, 2019, 12:29 PM IST

Updated : Sep 8, 2019, 12:48 PM IST

రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ వద్ద పేలుడు

తెలంగాణలోని హైదరాబాద్​ రాజేంద్రనగర్​ ఎక్స్​ప్రెస్​ వే పిల్లర్​ 279 వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ఆ వ్యక్తి శరీరం ఛిద్రమైంది. ఫుట్​పాత్​పై ఉన్న పాలిథిన్​ కవర్​ను తెరిచేందుకు యత్నించగా... ఈ పేలుడు జరిగింది. ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​, క్లూస్​ టీమ్​ తనిఖీలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​రెడ్డి... ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వ్యక్తి రాజేంద్రనగర్​కు చెందిన అలీగా గుర్తించారు. పోలీసులు రాజేంద్రనగర్​ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

Last Updated : Sep 8, 2019, 12:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.