ETV Bharat / jagte-raho

అక్రమ లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్ - గుంటూరులో బ్యాంక్​ మేనేజర్ మోసం వార్తలు

అక్రమ లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్ ను.. గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది దగ్గర పనిచేసే తన సోదరుడి సాయంతో బ్యాంక్​ మేనేజర్ ఈ పని చేశాడు.

అక్రమ లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్

author img

By

Published : Oct 28, 2020, 1:42 PM IST

Updated : Oct 28, 2020, 3:34 PM IST

విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్.. తెనాలికి చెందిన కోటేశ్వరరావు అనే న్యాయవాది పేరిట బ్యాంకు ఖాతా తెరిచాడు. న్యాయవాది వద్ద దుర్గా ప్రసాద్ సోదరుడు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సోదరుడి సాయంతో న్యాయవాది ఆధార్ నంబర్ సేకరించి.. బ్యాంకు ఖాతా తెరిచాడు. అందులో తన ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. అయితే తమ బ్యాంకులో ఖాతా తెరిచినందుకు ధన్యవాదాలు అంటూ.. బ్యాంకు నుంచి కోటేశ్వరరావు చిరునామాకు లేఖ వచ్చింది. ఆధార్ కార్డులో చిరునామా మేరకు లేఖ నేరుగా కోటేశ్వరరావుకు రావడంతో ఆశ్చర్యపోయారు. తనకు తెలియకుండానే ఖాతా తెరవటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరపగా బ్యాంక్ ఖాతాలో 19 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ లావాదేవీల కోసమే దుర్గాప్రసాద్ ఇలా చేసినట్లు తేల్చారు. దుర్గాప్రసాద్​ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినట్లు తెనాలి పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిన వారిని కూడా విచారించనున్నారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని బాధితుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మా బ్యాంకులో ఖాతా తెరచినందుకు ధన్యవాదాలంటూ చైన్నైలోని బ్యాంకు కార్పొరేట్ కార్యాలయం నుంచి కోటేశ్వరరావుకు లేఖ రావటంతో ఆయన విజయవాడ వెళ్లి బ్యాంక్ మేనేజర్​ను కలిసినట్లు తెలిపారు. తప్పయిందని క్షమించాలని మేనేజర్ కోరినట్లు కోటేశ్వరరావు వెల్లడించారు. అసలు వారి ఉద్దేశం ఏంటనేది తేల్చాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలపై అభిప్రాయాలు చెప్పిన పార్టీలు.... గత నోటిఫికేషన్లన్నీ రద్దు చేయాలన్న విపక్షాలు

Last Updated : Oct 28, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.