అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించే ఒక ముఠాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. అనంతపురం నగర పరిధిలోని రుద్రంపేటలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ముఠాను పట్టుకున్నారు. గంగాధర్ అనే వ్యక్తి... విశాఖపట్నానికి చెందిన ఓ ముఠా దగ్గర గంజాయి కొనుగోలు చేసి అనంతపురం జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు గౌసియా, చంద్రశేఖర్ అనే వ్యక్తులు కూడా ముఠాలో ఉన్నారు. వీరు గంజాయిని చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, కూలీలకు విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
గంజాయి విక్రయంలో ప్రసాద్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అనంతపురంతో పాటు గుంతకల్లులో గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ఆరు లక్షలు విలువ చేసే 55కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు.
ఇదీ చూడండి