కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లూటీ గిరిజన తండాలో దారుణం జరిగింది. పిల్లనిచ్చిన మామపైనే విల్లంబుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అల్లుడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ప్రాణం తీసేదాకా వెళ్లింది.
బైర్లూటిగూడెంలో నివసిస్తున్న బర్మాల బయ్యన్నపై సొంత అల్లుడు చిన్నడు బాణాలు వేశాడు. గుండె భాగానికి కొద్దిగా కిందివైపు బాణం గుచ్చుకోవటంతో... బాధితుడు విలవిల్లాడిపోయాడు. తన చెల్లెలితో గొడవ పెట్టుకొని...తన తండ్రిని గాయపరిచాడని బాధితుని పెద్ద కుమార్తె గురవమ్మ తెలిపింది. తొలుత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా... గుంటూరు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. శరీరంలో గుచ్చుకున్న బాణంతోనే బాధితుణ్ని బంధువులు సుమారు 350 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు.
శస్త్రచికిత్స విజయవంతం..
శరీరంలో బాణాలు దిగిన వృద్ధుణ్ని జీజీహెచ్ వైద్యులు కాపాడారు. 3 గంటలపాటు శ్రమించి 2 బాణాలను బయటకు తీశారు. డాక్టర్ కల్యాణి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతమైంది.
ఇవీ చదవండి: