పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారు జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వంకాయల శ్రీనివాసరావు, బ్యాంక్ క్లర్క్ కాంత్ ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి : నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలు