ETV Bharat / international

'మరియుపోల్​లో 10 వేల మంది పౌరులు మృతి!'

Ukraine Crisis: రష్యా యుద్ధం ప్రకటించిన నాటి నుంచి ఉక్రెయిన్​లోని మరియుపోల్ నగరంలో 10,000 మందికి పైగా పౌరులు మరణించారని ఆ నగర మేయర్ వాడిమ్ బోయ్చెంకో తెలిపారు. మారణహోమాన్ని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో మృతదేహాలను ఖననం చేయడానికి మొబైల్ శ్మశానవాటికలను రష్యా దళాలు ఉపయోగించాయని ఆరోపించారు.

Ukraine Crisis
ఉక్రెయిన్ యుద్ధం
author img

By

Published : Apr 11, 2022, 11:05 PM IST

Ukraine Crisis: రష్యా యుద్ధం కారణంగా మరియుపోల్ లో ఇప్పటివరకు 10,000 మందికి పైగా పౌరులు మరణించారని ఆ నగర మేయర్ వాడిమ్ బోయ్చెంకో తెలిపారు. నగర వీధుల్లోని కార్పెట్లలో ఎక్కడపడితే అక్కడ శవాలు దర్శమిస్తున్నాయని చెప్పారు. మరణాల సంఖ్య 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. మృతదేహాలను ఖననం చేయడానికి మొబైల్ శ్మశానవాటికలను రష్యా దళాలు ఉపయోగించాయని అన్నారు. రష్యా దళాలు సృష్టిస్తున్న మారణహోమాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇదో ప్రయత్నమని ఆరోపించారు.

గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్​పై యుద్ధాన్ని ప్రకటించింది రష్యా. భారీ ఆయుధాలను జనావాసాలపై ప్రయోగించి మారణహోమాన్ని సృష్టిస్తోంది. కీవ్ సహా పలు కీలక నగరాలను ఆక్రమించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అటు.. రష్యా దాడిని ఉక్రెయిన్​ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రాణాలకు తెగించి ఉక్రెయిన్ సైనికులు రష్యా దళాలతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో సైనికులు నెలకొరిగారు. సైనికులతో పాటు సాధారణ జనం కూడా మరణిస్తున్నారు.

ఇదీ చదవండి: యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయాం: రష్యా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.