ETV Bharat / international

తైవాన్​లో మరోసారి భారీ భూకంపం- కుప్పకూలిన మూడంతస్తుల భవనం - తైవాన్​ భూకంపం అప్డేట్స్​

తైవాన్​ను​ భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోగా.. పలు చోట్ల ఆస్తి నష్టం జరిగింది. యూలిలో కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యటకులు చిక్కుకుపోయారు.

strong-earthquake-hits-southern-taiwan-building-collapses

author img

By

Published : Sep 18, 2022, 4:35 PM IST

Earthquake in Taiwan : తైవాన్​ను​ భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన ఈ భూకంపం వల్ల పలు చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తైవాన్​ ఉత్తర ప్రాంతంలోని తైపీలో భూమి కంపించింది. యూలీలోని ఓ రహదారి పైనున్న వంతెన​ నేలమట్టమైంది. ఆ సమయంలో బ్రిడ్జ్​పై వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకోగా రక్షణ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అదే ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒక్కరిని సురక్షితంగా బయటకు తీయగా మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాయున్​ పట్టణంలోని ఓ స్పోర్ట్స్​ సెంటర్​లోని ఐదవ అంతస్తులో ఉన్న గది సీలింగ్​ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ 36 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు.

strong-earthquake-hits-southern-taiwan-building-collapses
భవనం వద్ద అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు

క్షతగాత్రులను వెలికితీస్తున్న సిబ్బంది

శనివారం సాయంత్రం నుంచి తైవాన్​ ఆగ్నేయ తీరాల్లో సంభవించిన భూకంపాలలో 6.8 తీవ్రతతో నమోదైన భూకంపమే అతి పెద్దదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే ప్రాంతంలో మరోసారి 6.4 తీవ్రత నమోదైంది. చిసాంగ్​లోని భూకంప కేంద్రం సుమారు 7 కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్​ కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది.

సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది

నేలకొరిగిన భవనం

'ఆరెంజ్ డే లిల్లీస్‌'కు ప్రసిద్ధి చెందిన యులిలోని పర్వతంపై కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. విద్యుత్​ లేక, ఫొన్​ సిగ్నల్స్​ దొరకక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. మరోవైపు.. తైవాన్ సమీపంలోని అనేక దక్షిణ జపాన్​ దీవులకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వాటిని తర్వాత ఉపసంహరించుకుంది.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది దుర్మరణం

వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.